గణపయ్యకు ఘన వీడ్కోలు


Thu,September 12, 2019 04:22 AM

నవరాత్రులు విశేష పూజలందుకున్న గణపయ్యకు బుధవారం జిల్లా ప్రజలు ఘన వీడ్కోలు పలికారు. జిల్లా కేంద్రంలోని శ్రీవేదాంత భజన మందిరంలో ఏర్పాటు చేసిన మట్టి గణపయ్య విగ్రహానికి కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. కోదాడలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు, మూసీ, పాలేరు, కోదాడ పట్టణంలోని పెద్దచెరువు, మట్టపల్లి, చింత్రియాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఘాట్‌ల వద్ద విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువకుల తీన్మార్ డ్యాన్స్‌లు, మహిళల కోలాటాలు శోభాయాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.-సూర్యాపేట, నమస్తే తెలంగాణ

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...