ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి


Wed,September 11, 2019 11:31 PM

-ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
-సిద్దిపేట పట్టణంలోని బావీస్‌ఖానాపూల్ సందర్శన
-రత్నదీప్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సీజనల్ వ్యాధుల పట్ల, ప్రజాఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి మురుగునీటి కాల్వలను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ రోడ్‌లోని బావీన్‌ఖానాపూల్‌ను మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, డిప్యూటీ ఈఈ లక్ష్మణ్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజలకు విషజ్వరాలు రాకుండా ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని, పట్టణంలోని ప్రతి వార్డులో ఎమర్జెన్సీ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు సమన్వయంతో ఇంటింటికీ తిరిగి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. పట్టణం లో చేపడుతున్న పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలపై ఆరా తీశారు. రెండు రోజుల్లో బావీస్‌ఖానాపూల్ మురుగు నీటి కాల్వను శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, నాయకులు పాల సాయిరాం ఉన్నారు.కాగా, హరీశ్‌రావు వ్యక్తిగత పీఆర్వో శేషుకుమార్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా డు. మంగళవారం రాత్రి శేషుకుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించి, త్వరగా కోలుకోవాలన్నారు. యోగా సాధన చేయాలని, మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.

- అభినందనలు.. శుభాకాంక్షల వెల్లువ
ఆర్థిక మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టి సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా బుధవారం ఉదయం ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు సిద్దిపేటలోని మంత్రి నివాసానికి చేరుకోవడంతో సందడిగా మారింది. ఈ సందర్భంగా అభిమానులు మంత్రి హరీశ్‌రావుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొమురవెల్లి ఆలయ పండితులు మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులను ఆలింగనం చేసుకుంటూ పలుకరించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి హరీశ్‌రావుతో సెల్ఫీ దిగారు.

- రత్నదీప్ సూపర్ మార్కెట్ ప్రారంభం
పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌లో రత్నదీప్ రీటైలింగ్ అవుట్‌లెట్ సూపర్ మార్కెట్‌ను జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ పూజల లతావెంకటేశ్వర్‌రావుతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కేంద్రమైన తరువాత దినదినాభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే పలు సూపర్ మార్కెట్లు వచ్చాయని, రత్నదీప్ అవుట్‌లెట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...