యూరియా వచ్చింది


Wed,September 11, 2019 01:02 AM

-జిల్లాకు చేరిన సుమారు 6342 మెట్రిక్‌ టన్నుల యూరియా
-సీఎం ఆదేశాలతో గ్రామాలకు తరలిస్తున్న అధికారులు
-ఇప్పటివరకు 47వేల మెట్రిక్‌ టన్నుల సరఫరా
-మరో 20వేల మెట్రిక్‌ టన్నులకు ఇండెంట్‌
రెండు, మూడురోజుల్లో తీరనున్న రైతుల ఇబ్బందులు
నీలగిరి: యూరియా కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టింది. సీఎం ఆదేశాల నేపథ్యంలో రైళ్లు, లారీల ద్వారా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు యూరియాను విడతల వారీగా తెప్పిస్తున్నారు. ఆది, సోమవారాల్లో 6342 మెట్రిక్‌ టన్నులు ఐడీఎల్‌, ఇఫ్కో, సీఐఎల్‌, క్రిబ్‌కో, ఎన్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీల యూరియాను జిల్లాకు తెప్పించారు. మరో రెండు, మూడురోజుల్లో సుమారు 20వేల మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు రానుంది. కాగా వ్యాగన్లలో జిల్లాకు చేరిన 4300 మెట్రిక్‌ టన్నుల ఎరువు బస్తాలను వ్యవసాయశాఖ అధికారులు గ్రామాలకు లారీల్లో, ఇతర ట్రాన్స్‌ఫోర్టు వాహనాల్లో పంపిస్తున్నారు. జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు సుమారు 76వేల మెట్రిక్‌ టన్నుల యూరియా కావల్సిండగా ఇప్పటివరకు సుమారు 47 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చింది. ఆది, సోమవారాల్లోనే సుమారు 6342 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చింది. జిల్లాలో యూరియా కొరత దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ అధికారులు 20వేల మెట్రిక్‌ టన్నులు ఇండెంట్‌ పెట్టారు. ఇది కూడా మరో మూడు నాలుగురోజుల్లో జిల్లాకు విడుతల వారీగా రానుంది. దీన్ని అన్ని సహకార సంఘాలకు, ఫర్టిలేజర్స్‌ షాపులకు లారీల్లో సరఫరా చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందజేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

సీఎం ఆదేశాల మేరకు 8442 మెట్రిక్‌ టన్నులు
రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను వెంటనే గ్రామాలకు సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. డిమాండ్‌కు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందజేయాలని, ఇప్పటికే వివిధ నౌకశ్రాయాల్లో ఉన్న స్లాకును రైళ్లు, లారీల ద్వారా జిల్లాకు తెప్పంచి నేరుగా గ్రామాలకు పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లాకు కావాల్సిన యూరియా విడుతల వారీగా వస్తోంది. గత మూడు రోజులుగా జిల్లాకు 346 మెట్రిక్‌ టన్నుల యూరియా జడ్చన్ల వ్యాగన్‌ ద్వారా, 1200 మెట్రిక్‌ టన్నులు ఐపీఎల్‌ కంపెనీ ద్వారా ఎస్‌పీఐపీ నుంచి 1025 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చింది. ఇదికాకుండా సోమవారం ఇప్కో నుండి 1200 టన్నుల, ఇతర కంపెనీల నుండి మరో 1300 టన్నుల యూరియా వచ్చింది. జిల్లాలో 14 మండలాల్లో అదనంగా 2100 టన్నుల అవసరం ఉండగా రోడ్‌ మార్గం ద్వారా కృష్ణపట్నం పోర్టు నుండి యూరియా రానుంది. ఇంకా 10 నుండి 15వేలా మెట్రిక్‌ టన్నుల యూరియాను రెండు మూడు రోజుల్లో యూరియాను రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలంగాణకు తెప్పిస్తున్నారు. యూరియా కోసం రైతులు పడుతున్న రందీ రెండు మూడురోజుల్లో తీరనుంది.

గణనీయంగా పెరిగిన పంటల సాగు..
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 3,35, 055 హెక్టార్లలో ఆయాపంటలు సాగవుతాయన్న వ్యవసాయ యంత్రాంగం అంచనాలకు అనుగుణంగానే ఈసారి పంటలసాగు జరిగింది. ఆరంభంలో నైరుతి రుతుపవనాల మందగమనం కారణంగా ఖరీఫ్‌ ప్రశ్నార్థకమవుతుందన్న అంచనాలు తలకిందులు చేస్తు ఈ సీజన్‌లో పంటలు గణనీయంగా పెరిగాయి. 3,35, 055హెక్టార్ల సాధారణ సాగుకు గాను ఇప్పటివరకు 3,27,112 (98శాతం) హెక్టార్లలో ఆయా పంటలు సాగయ్యాయి. అత్యధికంగా వరి 66,436 హెక్టార్ల సాధారణ సాగుకు గాను 71,436 ( 108 శాతం) హెక్టార్లలో సాగు కాగా ఆ తర్వాత పత్తి 2,28,150 హెక్టార్ల సాధారణ సాగుకు గాను 2,35,408 (103శాతం) హెక్టార్లలో సాగు చేశారు. ఇక కందులు 5816, పెసర 796 హెక్టార్లు, వేరుశెనగ 563, జొన్న 296హెక్టార్లలో సాగు చేశారు. అయితే ఆయకట్టు పరిధిలో నీటి విడుదల కొనసాగుతుండటంతో మరో 10నుంచి 15వేల హెక్టార్లలో వరి సాగు పెరిగే అవకాశం ఉంది.

యూరియా కోసం ఆందోళన వద్దు..శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలోని రైతులు యూరియా కోసం ఎలాంటి ఆందోళన చెందవద్దు. అవసరాల మేరకు మాత్రమే రైతులు యూరియాను కొనుగోలు చేయాలి. నిల్వలు చేయవద్దు. జిల్లా రైతాంగానికి సరపడా యూరియా మూడు, నాలుగురోజుల్లో రానుంది. జిల్లాకు 76వేల మెట్రిక్‌ టన్నుల యూరియా కావాల్సిండగా ఇప్పటికే సుమారు 47వేల మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చింది. రెండు, మూడురోజుల్లో విడుదల వారిగా వ్యాగన్లు జిల్లాకు రానున్నాయి. యూరియా దొరకడం లేదనే అపోహలు రావడంతో రైతులు అవసరం ఉన్నా లేకున్నా వచ్చి అడుగుతుండడంతో కొంత ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. కొంత లోడింగ్‌, అన్‌లోడింగ్‌ తప్ప ఎలాంటి ఇబ్బందులు లేవు. మూడు, నాలుగురోజుల్లో యూరియా సులభంగా దొరుకుతుంది.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...