ప్రజల భాగస్వామ్యంతో నే ..30 రోజుల ప్రణాళిక సాధ్యం


Wed,September 11, 2019 01:01 AM

-నెల రోజుల్లో యువత కోసం మరో ప్రత్యేక పథకం
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
బాధ్యతగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి : మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
చిట్యాల : ప్రజలు, దాతల భాగస్వామ్యంతో పల్లెల సమగ్రాభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని రూపొందించారని, నెల రోజుల్లో యువత కోసం మరో ప్రత్యేక పథకం రానున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో సర్పంచ్‌ కంచర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఒకరోజు శ్రమదానం చేసి గ్రామాలను బాగు చేయాలని సూచించారు. ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ఉండడానికి ఏమి చేయాలని ప్రజలను ప్రశ్నించి, మొదటిసారి వీధుల్లో చెత్త వేస్తే రూ.500, రెండోసారి వేస్తే రూ.1000 ఫైన్‌ వేయాలని చెప్పి, వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గంగదేవి పల్లెలో పారిశుధ్య పరిరక్షణ కోసం గ్రామంలో స్వచ్ఛందంగా అమలు చేసిన ఫైన్‌ల విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని ప్రజలతో ఒప్పించారు. అలాగే నెల రోజుల్లో గ్రామంలో అందరికి మరుగుదొడ్లు ఏర్పాటయ్యేలా చూస్తానని అందుకోసం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గ్రామంలో పాత బావుల బొందలు, పిచ్చి మొక్కలు ఎక్కడ ఉన్నా తొలగించాలని సూచించారు. మరో నెల రోజుల్లో యువత కోసం ప్రత్యేక పథకం రానుందని ఇప్పుడు చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తే, మళ్లీ ఉరుమడ్లకు ఇచ్చి ఇక్కడి నుంచే ఆ పథకాన్ని అమలు చేస్తానని మంత్రి హామీ ఇచ్చా రు. యువతకు స్వయం ఉపా ధి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ఎవరి బాధ్యత వారు తెలుసుకోవటానికే 30 రోజుల ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విజ్ఞప్తి మేరకు సబ్‌స్టేషన్లను మంజూరు చేస్తానని, పిల్లాయిపల్లి, ఉదయసముద్రం కాల్వలను వేగంగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో మా ఊరు మా వీధి, మా రోడ్డు అనే భావన వచ్చి వాటన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఉరుమడ్ల గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి రాష్ట్రంలోనే ఉరుమడ్ల గ్రామం ఆదర్శంగా నిలిపి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా అవార్డు పొందాలన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉరుమడ్ల గ్రామ అభివృద్ధిక తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ మాట్లడుతూ రెండు మూడు రోజుల్లో గ్రామానికి రూ. 5.5 లక్షలు 14వ ఫైనాన్స్‌ నిధులు వస్తాయని, రానున్న 8 నెలల్లో మరో రూ.44 లక్షలు వస్తాయని అంతేకాకుండా ఉపాధి హామీ పథకం కింద రూ.50 లక్షలు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, నల్లగొండ, భువనగిరి యాదాద్రి జిల్లాల జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, ఎంపీపీ కొలను సునీతవెంకటేష్‌, జడ్పీటీసీ సుంకరి ధనమ్మయాదగిరి, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మం, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఈఈ తిరుపతయ్య, ఎస్‌ఈ కృష్ణయ్య మండల ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్‌, ఎంపీడీఓ బీ.లాజర్‌, తహసీల్దార్‌ సీహెచ్‌ విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...