నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో


Wed,September 11, 2019 01:00 AM

-24 క్రస్ట్‌గేట్ల నుంచి కొనసాగుతున్న నీటివిడుదల
-పూర్తిస్థాయిలో నిండిన సాగర్‌ జలాశయం
-భారీగా తరలివచ్చిన పర్యాటకులు
నందికొండ : నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో మంగళవారం ప్రాజెక్టు 24 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 3,59,352 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి కూడా భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలంలో పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పాదన చేస్తుండగా ప్రాజెక్టు 6 క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా మంగళవారం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు 4,13,239 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సాగర్‌ ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండడంతో వచ్చిన వరదను వచ్చినట్లుగా క్రస్ట్‌ గేట్లతో పాటు విద్యుత్‌ ఉత్పాదన ద్వారా, ఎడమ, కుడి కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో నిండిన సాగర్‌
నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లో 311.4423 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్‌ జలాశయం నుంచి క్రస్ట్‌ గేట్ల ద్వారా 3,59,352 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 32,805 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8022 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 10350 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, డీటీ గేట్సు (డైవర్షన్‌ టన్నల్‌ ) ద్వారా 10 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. రిజర్వాయర్‌ నుంచి మొత్తం 4,13,239 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా విడుదలవుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో ప్రస్తుతం 884.90 అడుగుల వద్ద 215.3263 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 3,30,468 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

పులిచింతల 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
చింతలపాలెం : పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 (45.77 టీఎంసీలు) అడుగులకుగాను ప్రస్తుతం 173.0 అడుగులు (42.72 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 3,84,371 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోంది. పులిచింతల ప్రాజెక్టు మొత్తం 24 గేట్లకుగాను 10 గేట్లు ఎత్తి 3,67,371 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. లీకేజీల ద్వారా 1000 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్‌ ఉప కేంద్రం ద్వారా 16,000 క్యూసెక్కులు మొత్తం 3,84,371 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో విడుదలవుతోంది.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...