నేడు గణేశ్‌ నిమజ్జన వేడుకలు


Wed,September 11, 2019 12:59 AM

-ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, ఎస్పీ రంగనాథ్‌
నల్లగొండ కల్చరల్‌ : గణేశ్‌ నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం జిల్లావ్యాప్తంగా గణనాథులకు వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను బందోబస్తుతోపాటు సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం జరిగే పానగల్‌ బైపాస్‌లోని వల్లాభరావుచెర్వు, నిడమనూరు సమీపంలోని 14వ మైలు రాయి, దామరచర్ల, వాడపల్లి, దేవరకొండ, నాగార్జునసాగర్‌ తదితర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తుతోపాటు ప్రత్యేక పర్యవేక్షణ చేర్పాటు చేశారు. ఆయా ఫ్రాంతాలల్లో విద్యుద్దీపాలతోపాటు బారీకేడ్ల, క్రెన్స్‌ను ఏర్పాటు చేశారు. వీరితోపాటు గజాఈతగాళ్లను సహితం అందుబాటులో ఉంచారు. సాయంత్రం 5గంటలకు గణనాథులు నల్లగొండలోని గడియారం సెంటర్‌కు చేరుకోనున్నాయి. అక్కడ నుంచి 5 మీటర్ల ఎత్తు పైబడి ఉన్న విగ్రహాలు దేవరకొండ రోడ్డు మీదుగా సాగర్‌రోడ్డుకు చేరుకుని 14వ మైలుకు, 5 మీటర్ల ఎత్తు ఉన్న విగ్రహాలు సావర్క్‌నగర్‌ మీదుగా పానగల్‌ బైపాస్‌లోని వల్లాభరావు చెరువుకు తరలించేలా చర్యలు చేపట్టారు. అయితే విగ్రహాలకు స్వాగతం పలికి పుష్పాంజలి అందచేసేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గడియారం సెంటర్‌, సావర్క్‌నగర్‌, ఎన్జీ కళాశాలతోపాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...