నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్‌


Wed,September 11, 2019 12:59 AM

నల్లగొండ కల్చరల్‌ : గణేశ్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. మంగళవారం అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రం సమీపంలోని వల్లభరావు చెరువువద్ద ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. వల్లభరావు చెరువు వద్ద ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, ఐబీ, పోలీస్‌, అగ్నిమాపక శాఖ, మత్స్యశాఖ, జిల్లా, వైద్య, ఆరోగ్య, ట్రాన్స్‌కో శాఖలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చెరువు వద్ద విగ్రహాలు నిమజ్జనం చేయుటకు అవసరమైన క్రేన్లు, బారికేడ్లు ఆర్‌అండ్‌బీ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. షిప్టు వారీగా నిమజ్జనం వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, రాత్రి వేళ కూడా విధులు నిర్వహించేలా మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. లైటింగ్‌, జనరేటర్‌ సౌకర్యం ఏర్పాటు చేసి షార్టు సర్క్యూట్‌ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. చిన్న విగ్రహాలను వల్లభచెరువులో నిమజ్జనం చేసుకోవచ్చన్నారు. గణేశ్‌ నిమజ్జనం పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలకు సెలవు ప్రకటించామని, రెండో శనివారం విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆయన వెంట పబ్లిక్‌ హెల్తు ఈఈ కందుకూరి వెంకటేశ్వర్లు, డీఎస్పీ గంగారాం, ఆర్డీఓ జగదీష్‌రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి యజ్ఞనారాయణ, డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు, కమిషనర్‌ దేవ్‌సింగ్‌, తహసీల్దార్‌ దామోదర్‌రావు, ఆర్‌ఐ కుమార్‌రెడ్డి, వీఆర్వో స్వప్న, ఉత్సవ కమిటీ సభ్యుడు బండారు ప్రసాద్‌, రఘుపతి పాల్గొన్నారు.

ఆంజనేయస్వామికి ఆకుపూజ
శ్రీవారి ఖజానాకు రూ.5,76,382 ఆదాయం
యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ నిర్వహించారు. తమలపాకులతో అర్చన చేశారు. ఆంజనేయస్వామికి వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారికి ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.70,888, రూ.100 దర్శనం టిక్కెట్‌తో రూ.25,000, వ్రతపూజలతో రూ.26,500, ప్రసాద విక్రయాలతో రూ.2,36,590, విచారణ శాఖతో రూ.26,000, శాశ్వత పూజలతో రూ.17,232, ఇతర విభాగాలతో రూ.93, 205 పాటు అన్ని విభాగాల నుంచి రూ.5,76,382 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆదాయశాఖ అధికారులు తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
నల్లగొండ సిటీ : గణేశ్‌ నిమజ్జనం చేసే ప్రాంతాలను మంగళవారం జిల్లా ఎస్పీ రంగనాథ్‌ పరిశీలించారు. పానగల్‌ బైపాస్‌రోడ్డులో ఉన్న వల్లభరావు చెరువుతో పాటు సాగర్‌ ఎడమ కాల్వ 14వ నెంబర్‌ మైలు రాయి వద్ద ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలె చేశారు. నిమజ్జన ప్రాంతాలలో ఏర్పాటు చేసిన క్రేన్లను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ గంగారామ్‌తో పాటు పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...