భక్తి శ్రద్ధలతో మొహర్రం


Wed,September 11, 2019 12:58 AM

నల్లగొండకల్చరల్‌ : మొహర్రం వేడుకలను మంగళవారం జిల్లా కేంద్రంలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల ఊరేగింపు వేడుకల్లో ముస్లింలతో పాటు హిందువులు సైతం వేడుకల్లో పాల్గొని స్నేహభావాన్ని చాటారు. పాతబస్తీ నుంచి పీర్ల ఊరేగింపు బయల్దేరి పట్టణంలోని పలు వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా యువకుల విన్యాసాలు, వేషధారణలు ఆకట్టుకున్నాయి. భక్తులు ధట్టీలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు ముస్లిం పెద్దలతో పాటు పట్టణ ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

16
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...