సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం


Tue,September 10, 2019 11:09 PM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కలెక్టరేట్‌ : ఆర్థిక శాఖమంత్రిగా హరీశ్‌రావు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా సిద్దిపేటకు మంగళవారం రాత్రి రావడంతో టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధు లు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి నేరు గా సిద్దిపేటకు చేరుకున్నారు. సిద్దిపేటలో ఆయన నివా సం వద్ద మంత్రి హరీశ్‌రావుకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి, సీపీ జోయల్‌ డెవిస్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఉద్యోగ సంఘాల నేతలు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు.. పట్టణంలోని పలు మండపాల్లోని గణపతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రిని కలిసిన వారిలో డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, స్త్రీశిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్‌ బూర విజయ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...