రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Tue,September 10, 2019 11:07 PM

-జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి
కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి నిదర్శనం బడ్జెట్‌లో రైతుబంధు కోసం 12 వేల కోట్ల రూపాయలు కేటాయించడమే నిదర్శనమని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రైతుబంధు పథకానికి రూ.10 వేలకు పెంచి ఇవ్వడంతో పాటు బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లు ప్రతిపాదించారన్నారు. రైతుబీమా ప్రీమియం చెల్లింపునకు 1137 కోట్ల రూపాయలను కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు లక్షలోపు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించడమే నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ సాగుకోసం ప్రభుత్వం ధృడనిశ్చయంతో ముందుకెళ్తుందన్నారు. వ్యవసాయ రంగానికి అవసరమైన సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుందన్నారు. ఉచితంగా 24 గంటల కరెంట్‌ అందజేస్తూ కర్షకుడికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ఒకవైపు పెట్టుబడి అందిస్తూ మరొక వైపు రైతుకు బీమా చేయించి రైతు రుణమాఫీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...