మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కృషి


Tue,September 10, 2019 11:07 PM

దుబ్బాక టౌన్‌ : నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌ లిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎ మ్మెల్యే శంకుస్థాపన చేశారు. స్థానిక ఎస్‌ఆర్‌ కళాశాల వద్ద సీసీ రోడ్డు పనులను, మల్లాయిపల్లి రోడ్డు, ఎస్సీ కాలనీ, కామర్స్‌ సుం దరయ్య గల్లీలో మురుగు కాలువల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో పెద్ద ఎత్తున మురుగు కాలువల నిర్మాణంతో పాటు అవసరమున్న ప్రతి చోట సీసీ రోడ్లు వేస్తామన్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా పనులు చేస్తామని పేర్కొన్నారు. దళిత కాలనీ, 15వ వార్డుల్లో మురుగు కాలువలు సరిగ్గా లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించామని, గణేశ నిమజ్జనం పూర్తి అయిన రోజు నుంచి ఈ పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజల అవసరాలను తీర్చుతామన్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను వెచ్చించి మిషన్‌ భగీరథ ద్వారా అందిస్తున్న తాగునీటిని వృథా చేయడం బాధాకరమని, అలాంటి వారి పై చర్యలు తీసుకుంటామన్నారు. దుబ్బాకు ఇటీవలే సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 10 కోట్ల రూపాయలు సైతం మంజూరైనట్లు అట్టి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సహకారంతో దుబ్బాక పట్టణం ఆదర్శవంతంగా తయారు చేయడమే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య, మిరుదొడ్డి ఎంపీపీ గజ్జెల సాయిలు, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు ఆస స్వామి, పర్స కృష్ణ, బండిరాజు, రొట్టె రమేశ్‌, ఆకుల రమేశ్‌, గన్నె భూంరెడ్డి, గాజుల భాస్కర్‌, ఆస యాదగిరి, వడ్లకొండ మధు తదితరులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...