గ్రామాల్లో జోరుగా 30 రోజుల ప్రణాళిక పనులు


Tue,September 10, 2019 11:07 PM

మిరుదొడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న 30 రోజుల ప్రణాళిక పనులను గ్రామాల్లో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఎంపీపీ గజ్జెల సాయిలు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారులు ఎంపీడీవో పి.సుధాకర్‌రావు, ఏవో బోనాల మల్లేశం వారి గ్రామాల్లో వివిధ రకాల పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మారం, రుద్రారం, లింగుపల్లి, అల్వాల గ్రామాల్లో ప్రత్యేక అధికారులు శ్రమదానం చేసి పిచ్చ మొక్కలను తొలిగించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రకారం ప్రతి రోజు మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల సహకారంతో పనులును చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గూళ్ల పుష్ప, ఎనగంటి కిష్టయ్య, ఉస సర్పంచ్‌లు, కార్యదర్శులు, వార్డు సభ్యులు, ఆంగన్‌వాడీ టీచర్లు, వైద్య సిబ్బందిపాల్గొన్నారు.
పల్లెల్లో జోరుగా పారిశుధ్య కార్యక్రమాలు
తొగుట : గ్రామ పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో మండలంలో గ్రామ గ్రామాన జోరుగా నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌లే కథానాయకులుగా మారి స్వయంగా తట్టా పార పట్టి శ్రమదానంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. జప్తిలింగారెడ్డిపల్లిలో పారిశుధ్య పనులను ఎంపీడీవో రాజిరెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి నవీన్‌ కుమార్‌, సర్పంచ్‌ చిలువేరి జ్యోతి మల్లారెడ్డి, ఉప సర్పంచ్‌ సురేశ్‌ గౌడ్‌, కార్యదర్శి సమీర్‌ ఆధ్వర్యంలో పనులు పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, మురికి గుంతలు పూడ్చడం, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎంపీడీవో రాజిరెడ్డి తెలిపారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...