బీసీ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్ శిక్షణ


Tue,September 10, 2019 04:31 AM

సిదిపేట ఎడ్యుకేషన్ : నిరుద్యోగ యువతకు టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉపాధి శిక్షణ అందిస్తున్నది. అందులో భాగంగా బీసీ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు సిదిపేట స్టడీ సెంటర్ డైరెక్టర్ కె. రాములు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పాస్ అయిన వారు..18 సంవత్సరాల నుంచి 33 సంవత్సారాల వయసు కలిగిన అభ్యర్థులు బీసీ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం జతచేసి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నాసర్ పురలోని స్టడీ సెంటర్‌ను గానీ, 08457-224941 నెంబర్‌కు సంప్రదించవచ్చని తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...