మదర్‌థెరిస్సా జాతీయ విశిష్ట పురస్కారం అందుకున్న ప్రకాశ్


Tue,September 10, 2019 04:31 AM

సిద్దిపేట టౌన్ : పశ్చిమ గోదావరి జిల్లాలోని మదర్ థెరిస్సా క్రియేటివ్ కల్చరల్ టాలెంట్ వేరియస్ స్కిల్స్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన మదర్ థెరిస్సా జాతీయ విశిష్ట పురస్కార అవార్డుల పురస్కారాలు సోమవారం జరిగాయి. కళారంగంలో తనదైన శైలిలో చైతన్యపర్చిన పిన్నింటి ప్రకాశ్‌కు మదర్ థెరిస్సా జాతీయ విశిష్ట పురస్కారం లభించింది. ఈ మేరకు అవార్డు కింద ప్రశంసాపత్రం, జ్ఞాపిక, బంగారు పతకం, బంగారు పూతతో కూడుకున్న మణిహారంతో ఘనంగా సత్కరించారు. ఈ అవార్డు రావడం పై ప్రకాశ్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన కళాకారులను గుర్తించి పురస్కారం ఇచ్చిన మదర్‌థెరిస్సా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...