ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు : కలెక్టర్


Tue,September 10, 2019 03:20 AM

బొడ్రాయిబజార్ : ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ డి.అమయ్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో జేసీ సంజీవరెడ్డితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. భూ సమస్యలు, సదరం సర్టిఫికెట్లు, రెండు పడకల గదులు, ఆసరా పింఛన్లపై దరఖాస్తులు వస్తున్నాయని, సంబంధిత అధికారులు దరఖాస్తులను అర్హత మేరకు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాను పచ్చని వనంలా మార్చేందుకు ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటాలని కోరారు. 30రోజుల గ్రామాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నియమించిన అధికారులు గ్రామసభల ద్వారా గ్రామాల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

తరచుగా వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులను అందుబాటులో ఉంచి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణికి దాదాపు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వికలాంగులశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులైన చిలుకూరు మండలం రామాపురం, చివ్వెంల మండలానికి చెందిన ధరావత్ శివ, పాయిలి చినలింగయ్యలకు ట్రైసైకిళ్లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ చంద్రయ్య, కోదాడ ఆర్డీఓ కిశోర్‌కుమార్, పీడీ కిరణ్‌కుమార్, సీపీఓ అశోక్, పీడీ ఐసీడీఎస్ నరసింహారావు, డీఏఓ జ్యోతిర్మయితోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...