ఆరోగ్య తెలంగాణే ప్రధాన లక్ష్యం


Tue,September 10, 2019 03:20 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్య తెలంగాణగా మార్చుకునేలా ప్రభుత్వం ముందుకెళ్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు రూ.6.5కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో కొనుగోలు చేసిన వాహనాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో చెత్త ఎక్కువ అవుతుందని, దీంతో ప్రజలు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీటిని సక్రమంగా వినియోగిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ యంత్రాంగానికి సూచించారు. నల్లగొండలో చెత్త సేకరణ కోసం నెలకు రూ.13.5లక్షలు ఖర్చు చేసేవారని, ఇక ఆ సమస్య ఉండవద్దని రూ. 3.81కోట్లతో వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. నల్లగొండ ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైనందున అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే నల్లగొండకు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మరిన్ని నిధులు రానున్నట్లు తెలిపారు.

వాహనాలను నడిపిన మంత్రి..
రూ. 6.5 కోట్లతో చెత్త సేకరణకు వాహనాలను కొనుగోలు చేయగా వాటిల్లో ట్రాక్టర్, ఆటోను మంత్రి స్వయంగా డ్రైవ్ చేసి పరిశీలించారు. కార్యక్రమంలో చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్ ఆర్వో మాలే శరణ్యారెడ్డి పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...