మంత్రి జగదీష్‌రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ


Tue,September 10, 2019 03:20 AM

సూర్యాపేట టౌన్ : మొన్నటి వరకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగి నేడు మరో సారి విద్యుత్ శాఖ మంత్రిగా గుంటకండ్ల జగదీష్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కేంద్రానికి తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా స్థానిక క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తమ అధినేతపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకం ఉంచి పవర్‌పుల్ శాఖను మంత్రి జగదీష్‌రెడ్డికి కేటాయించడం పట్ల టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ శాలువాలు, పుష్పగుచ్ఛాలతో మంత్రిని ఘనంగా సత్కరించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మొరిశెట్టి శ్రీనివాస్, పోలబోయిన నర్సయ్యయాదవ్, బెల్లంకొండ యాదగిరి, వర్దెల్లి శ్రీహరి, కక్కిరేణి నాగయ్య, పుట్ట కిశోర్, ఎల్గూరి రాంబాబు, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, నేరెళ్ల మధు, వడ్డేపల్లి రవి, అజీజ్, తాహెర్, రమాకిరణ్, రఫీ, చరణ్, వేణుగోపాల్‌రెడ్డి, హనుమంతరావు తదితరులు ఉన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...