వైభవంగా శ్రీలక్ష్మీనృసింహుడి నిత్యకల్యాణం


Tue,September 10, 2019 03:19 AM

మఠంపల్లి : పవిత్ర పుణ్యక్షేత్రమైన మట్టపల్లి లక్ష్మీనృసింహ స్వామి నిత్యకల్యాణోత్సవం దేవాలయ అర్చకులచే సోమవారం వైభోవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరనం, పంచగవ్య ప్రాసన నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణ తంతు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, కార్యనిర్వహణాధికారి ఉదయభాస్కర్, దేవాలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...