కొనసాగుతున్న ముత్యాలమ్మ జాతర


Tue,September 10, 2019 03:19 AM

హుజూర్‌నగర్, నమస్తేతెలంగాణ : ముత్యాలమ్మ జాతరలో భాగంగా రెండో రోజు సోమవారం యూపీఎస్ పాఠశాల వద్ద మూడు ముత్యాలమ్మలుగా పిలువబడే అంకమ్మ, మద్దిరావమ్మ, యలమంచమ్మలకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. పట్టణవాసులు విద్యుద్దీపాలతో అలంకరించిన ప్రభలతో గుడి చుట్టూ తిరుగుతూ మొక్కులు తీర్చుకున్నారు. ప్రభలను టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడానికి మహిళలు వేల సంఖ్యలో తరలివచ్చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, అట్లూరి హరిబాబు, జక్కుల నాగేశ్వర్‌రావు, రవినాయక్, కోతి సంపత్‌రెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...