విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు


Mon,September 9, 2019 02:55 AM

-ఆదర్శ పాఠశాలల్లో ఎంసీఎంఎఫ్‌ పరీక్షలు
-పదో తరగతి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యం
-ఉన్నత కోర్సులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన
-ఇప్పటికే ఆన్‌లైన్‌ టెస్ట్‌ పూర్తి..త్వరలో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌
తిరుమలగిరి, నమస్తే తెలంగాణ : విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలోని ఆదర్శపాఠశాలల్లో మై చాయిస్‌ .. మై ఫ్యూ చర్‌ (ఎంసీఎంఎఫ్‌ ) కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వారికి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయడానికి ఓ ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ సంస్థతో కలిసి దీన్ని చేపట్టింది. జిల్లాలోని 9 ఆదర్శపాఠశాలల్లోని 9 మ ంది ఉ పాధ్యాయులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా విద్యార్థుల శక్తి సామర్థ్యాలను వెలికి తీస్తున్నారు.

విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యనందిస్తున్నాయి. ఇందులో భాగంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్టుగా భవిష్యత్‌ కార్యాచరణ రూ పొందించేందుకునేందుకు మై చాయిస్‌.. మై ఫ్యూచ ర్‌ కార్యక్రమా న్ని ప్రవేశపెట్టారు. ఆదర్శపాఠశాలల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు ఎంసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ ఇచ్చా రు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయులతోపాటుగా పోషకులకూ శిక్షణ పొందిన అంశాలను వివరిస్తున్నారు. విద్యార్థుల ఆలోచన ధోరణి, పరిస్థితుల ప్రభావం, అభిరుచుల ఆధారంగా వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వివరిస్తున్నారు. అలా గే విద్యార్థులకు ఎంసీఎంఎఫ్‌ టెస్ట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్‌ల్లో 72 ప్రశ్నలు ఉంటా యి. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటితోనే విద్యార్థుల అభిరుచులు సులువుగా తెలుస్తాయి. వీటి ఆధారంగానే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, బోధన, పరిశోధన, ఆరోగ్యం, విద్య, రక్షణ విభాగం, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తి చేస్తే లభించే ఉద్యోగ అవకాశాలను వివరిస్తున్నారు. వారిలో ఆత్మ వి శ్వాసం పెంపొందిస్తున్నారు. ఈ నెల 8తో కార్యక్రమం ముగియగా విద్యార్థుల అభిరుచులపై తల్లిదండ్రులకు త్వరలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే మిగతా పాఠశాలల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...