నాగార్జునసాగర్‌లో పర్యాటకుల సందడి


Mon,September 9, 2019 02:54 AM

నందికొండ : ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌ను ఆదివారం విద్యార్థులు, ఉద్యోగులు, విదేశీ పర్యాటకులు సందర్శనతో కళకళలాడింది. నాగార్జునకొండలో బుద్ధుడి జీవిత గాథలకు సంబంధించిన శిల్పాలను పొందుపరిచిన ఆర్కియాలజీ మ్యూజియాన్ని సందర్శించేందుకు తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో నాగార్జునకొండకు వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపారు. నాగార్జునకొండకు లాంచీలో ప్రయాణం ఆహ్లాదంగా ఉందని, నాగార్జునకొండలో యజ్ఞశాల, ఎత్తైన బుద్ధుడి విగ్రహం, అశ్వవేదయాగశాల, ఇటుకలతో ఏర్పాటు చేసిన స్వస్తిక్‌ గుర్తు, అలనాటి నదీలోయ నాగరికతలకు సంబంధించిన చారిత్రక విశేషాలు తెలుసుకోవడం బాగుందని పర్యాటకులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ డ్యాం పూర్తిస్థాయిలో నిండడం, వినాయక నిమజ్జనాలకు భక్తులు వస్తుండడంతో సాగర్‌ పరిసరాలైన శివాలయం, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం వద్ద సందిడి నెలకొన్నది. సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. తెలంగాణ టూరిజం శని, ఆదివారాల్లో నాగార్జునకొండతోపాటు జాలీ ట్రిప్పులను నడపడంతో రూ.80వేల ఆదాయం వచ్చినట్ల్లు లాంచీ స్టేషన్‌ మేనేజర్‌ హరిబాబు తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...