ప్రభుత్వ పాఠశాలల బలోపేతం సీఎం కేసీఆర్‌ ఘనతే


Mon,September 9, 2019 02:54 AM

-ఐదేళ్లుగా ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య పెరిగింది
-గురుకులాలు పేదల పాలిట వరాలుగా మారాయి
-శాసన మండలి మాజీ చీఫ్‌ విప్‌ సుధాకర్‌రెడ్డి
సూర్యాపేటటౌన్‌ : తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంతో ప్రజలకు మరింత నమ్మకం పెరిగి తమ పిల్లలను ఐదేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే సంఖ్య పెరిగిందని శాసన మండలి మాజీ చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. గురుకుల పాఠశాలలు పేదలపాలిట వరాలుగా మారాయని.. ప్రస్తుతం పేద, మధ్యతరగతితో పాటు ధనికులు, ఉద్యోగులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛందంగా చేర్పిస్తున్నారన్నారు. దీంతో ప్రజలందరికీ ప్రభుత్వ విద్యపై మరింత నమ్మకం పెరగడంతో విద్యార్థుల సంఖ్య బాగా పెరిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు సీఎం కేసీఆర్‌తోనే పరిష్కారమవుతాయని.. అన్ని రంగాలకు శాస్విత పరిష్కారం దిశగానే తెలంగాణలో అభివృద్ధిపాలన కొనసాగుతుందన్నారు. అలాగే నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో జరిగిన పెన్‌పహాడ్‌ మండలం జంగంపడిగ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న కోడి వెంకటయ్య ఉద్యోగ విరమణ వేడుకలో పాల్గొని వారి దంపతులను ఘనంగా సత్కరించారు. విలేకరుల సమావేశంతో పాటు ఉద్యోగ విరమణ కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం చెన్నయ్య, మహిళా అధ్యక్షురాలు గోలి పద్మ, ఎంఈఓ రవి, అంకతి వెంకన్న, సామ కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, రమేష్‌, లింగమూర్తి, సత్యనారాయణ, లక్ష్మీనారాయణతో పాటు సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...