టన్ను బత్తాయి@ రూ.40 వేలు


Mon,September 9, 2019 02:54 AM

హాలియా, నమస్తే తెలంగాణ : జిల్లాలో బత్తాయి టన్నుకు రూ.40వేల ధర పలుకుతోంది. దీంతో బత్తాయి సాగుచేసే రైతాంగం ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ ఏడాది బత్తాయి రైతులకు ధర కాసులు కురిపిస్తుంది. జిల్లాలో సుమారు 2.50లక్షల ఎకరాల్లో బత్తాయి సాగులో ఉంది. వేసవిలో సరైన వర్షాలు లేకపోవడంతో పండ్ల తోటలు కొంతమేరకు దెబ్బతిన్నప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు పండ్లతోటలు కళకళలాడుతున్నాయి. దిగుబడి గణనీయంగా ఉండడంతోపాటు ధర కూడా క్వింటాల్‌కు ధర గరిష్టంగా రూ.40 వేలు పలుకుతుంది. గతంలో ఇదే సీజన్‌లో రూ.10వేల నుంచి రూ.15వేల వరకు మించి ధర ఉండేదికాదు. కాని ఈ ఏడాది భిన్నంగా గతంతో పోలిస్తే బత్తాయి రైతుకు మంచి ధర వస్తుంది. వర్షాభావ పరిస్థితులు బత్తాయి దిగుబడిపై కొంత ప్రభావం చూపినప్పటికీ మంచి ధరతో రైతాంగానికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. గతంలో బత్తాయి రైతులకు తక్కువ ధర పలకడంతో కనీసం పెట్టిన పెట్టుబడులు వెళ్లేవికావు. కాని ఈసారి సీజన్‌లో బత్తాయికి మంచి దిగుబడి ఉంది. బత్తాయిని కొనుగోలు చేసేందుకుగాను కర్నూలు, అనంతపురం, ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు గ్రామాల్లోని రైతుల వద్దకు వచ్చి బత్తాయి కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు నల్లగొండ జిల్లా కేంద్రంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం బత్తాయి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. ఈనేపధ్యంలో రైతు పండించిన బత్తాయికి మంచి గిట్టుబాటు ధర లభించింది. నల్లగొండ రైతులకు దళారుల బెడద లేకపోవడంతో రైతుకు మంచి ధర పలుకుతుంది.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...