యూరియాను రైతులకు ఎప్పటికప్పుడు అందించాలి


Mon,September 9, 2019 02:53 AM

-జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి జ్యోతిర్మయి
-జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లోస్టాక్‌ బోర్డులు,నిల్వల వివరాల పరిశీలన
సూర్యాపేట వ్యవసాయం : జిల్లా వ్యాప్తంగా ఉన్న డీలర్లు, పీఏసీఎస్‌ అధికారులు యూరియాను ఎప్పటికప్పుడు రైతులకు అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి జ్యోతిర్మయి అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఎరువుల దుకాణాలలో ఆదివారం ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలిం చి మాట్లాడారు.జిల్లాలోని రైతులకు యూరియాను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీఏసీఎస్‌ ,గ్రోమోర్‌, డీలరు దుకాణాల్లో అందుబాటులో ఉంచామని రైతులు వాటి ద్వారా యూరియా బస్తాలను పొందవచ్చునన్నారు. రైతులకు యూరియాను అందించే కేంద్రాలు వారి వద్ద ఉన్న వివరాలను ఎప్పటికప్పుడు వివరాలు అందించాలని సూచించారు. రైతులకు యూరియాను అందించకుండా కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్నిమండలాల్లో వ్యవసా య అధికారులతో పాటు, తనిఖీ బృందాలు దాడులు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన యూరియా ను తీసుకువస్తున్నామని ఎలాంటి కొరత లేకుండా చూస్తామన్నారు. రైతులు తమకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా యూరియాను తీసుకువెళ్లాలని తెలిపారు. రైతులు రానున్న రోజులలో యూరియా లభిస్తుందో లేదో నని ముం దుగానే కొనుగోలు చేసి నిల్వలు చేసుకుంటున్నారన్నారు. రైతులు యూరియాను రెండో దఫా కోసం నిల్వ చేయాల్సిన అవసరం లేదని రానున్న వారం రోజుల్లో మరింత యూరియా జిల్లాకు రానున్నదన్నారు. ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన వారిలో సూర్యాపేట ఏడీఏ రామారావునాయక్‌, ఏఓ జానీమియా,డీలర్లు ఉప్పల ఆనంద్‌, మొరిశెట్టి యోగి, కర్నాటి నారాయణరావు, రుక్మాధర్‌, నాగేశ్వర రావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...