సాంకేతిక సమాచార వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలి


Mon,September 9, 2019 02:53 AM

-కేవీకే శాస్త్రవేత్త లవకుమార్‌
గరిడేపల్లి: సాంకేతిక సమాచార వినియోగంపై దేశీ కోర్స్‌ చేస్తున్న డీలర్లు అవగాహనను పెంపొందించుకోవాలని కేవీకే శాస్త్రవేత్త బి.లవకుమార్‌ సూచించారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో గల కేవీకేలో ఆదివారం దేశీ కోర్స్‌ చేస్తున్న డీలర్లకు సైబర్‌ ఎక్స్‌టెన్షన్‌, మార్కెట్‌ లెడ్‌ ఎక్స్‌టెన్షన్‌ అంతర్జాల ఆధారిత వ్యవసాయ యాప్స్‌ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డీలర్లు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక సమాచారాన్ని నేర్చుకుంటూ వెంటనే రైతులకు సరియైన సూచనలు అందిస్తూ అవసరమైన ఉపకరణాలను ఇవ్వాలన్నారు. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు వ్యవసాయ సంబంధిత యాప్స్‌ను రూపొందించారని వాటిని రైతులు వినియోగిం చుకునేలా చూడాలన్నారు. నా పంట, కృషి విజ్ఞాన్‌, అగ్రినెట్‌, ఎంకిసాన్‌, ప్లాంటిక్స్‌, అగ్రి యాప్‌, ఇఫ్‌కో కిసాన్‌ మొదలైన యాప్స్‌ను ఫొన్లలలో డౌన్‌ లోడ్‌ చేసుకుని పంటల సాగు, మార్కెంటింగ్‌లకు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చాన్నారు. ఇవే కాకుండా ఎఫ్‌ఎం రేడియో, టీవీ చానళ్లు మొబైల్స్‌, పత్రికలు, మ్యాగజైన్‌ల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు పం టల సాగు, వాతావరణ పరిస్థితులు, మార్కెటింగ్‌ విధానాలపై సమాచారం అందించ బడుతున్నదాన్నరు. వీటిని రైతులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో దేశీ కోర్స్‌ ఫెసిలిటేటర్‌ భిక్షం, డీలర్లు వెంకటేశ్వర్లు, మహేష్‌, సోమయ్య, యాకూబ్‌; శ్రీనివాస్‌, ఈశ్వర్‌లతో పాటు 30 మంది డీలర్లు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...