ప్రజల సహకారంతోనే రక్షిత కాలనీలు


Sun,September 8, 2019 11:28 PM

-సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
-పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌
-15వ వార్డులో అవగాహన సభ
-లక్ష రూపాయలు అందజేసిన..
- టీఆర్‌ఎస్‌ నేత మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్‌
సిద్దిపేట టౌన్‌ : సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని, ప్రజలందరి సహకారంతో సేఫ్‌ కాలనీలు ఏర్పాటు చేద్దామని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ అన్నారు. 15వ వార్డులో సీసీ కెమెరాల ఆవశ్యకత పై ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌ నాయకుడు మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ రూ. 50 వేల నగదు, 50 వేల చెక్కు రూపకంలో అందజేవారు. అనంతరం సీపీ జోయల్‌ డెవిస్‌ మాట్లాడుతూ.. కాలనీలో ఉన్న ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, పెద్దల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పా టు ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలనీ ప్రజ ల సహకారం, ఆమోదంతో చేపట్టే ప్రణాళికలు సఫలమవుతాయన్నారు. ప్రజలందరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని, ఇదే విధానం కొనసాగించి పోలీస్‌ శాఖకు సహకరించాలని సీపీ కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించ డం, కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించే అవకాశం ఉందనివివరించారు. 24 గంటల పాటు నిరంతరాయంగా సీసీ కెమెరాల పనిచేస్తాయని చెప్పారు. రాత్రి సమయా ల్లో కాలనీకి వెళ్లే దారులన్నీ మూసి ఒకే ఎంట్రీని ఏర్పాటు చేసుకుంటే నేరాలు జరగకుండా నియంత్రించవచ్చని తెలిపారు. తద్వారా కొత్త వ్యక్తు లు ఎవరైనా వస్తే సమాచారం వెంట నే తెలుస్తుందన్నారు. ఇటీవల పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయని, దీని ద్వారా ప్రమాదాల శాతం తగ్గుముఖం పట్టిందన్నారు. ఇప్పటికే జిల్లాలో 85శాతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నేను సైతం కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు చేరువవుతున్నట్లు తెలిపారు. 2019 మోటరు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు బాగా పెరిగాయని, వాహనదారులు విధిగా హెల్మెట్‌, సీటు బెల్టు ధరించాలని, వాహన ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలోని అన్ని కాలనీల్లో ప్రజల సహకారంతో సేఫ్‌ కాలనీల ఏర్పా టుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళం ఇచ్చిన మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ను సీపీ అభినందించారు.
కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్‌, సీఐలు సైదులు, శ్రీనివాస్‌, ఎస్‌ఐలు శ్రీనివాస్‌, రవి, వ్యాపార్తులు, ఉద్యోగులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...