లద్దె పురుగుతో పత్తి చేలకు నష్టం


Sun,September 8, 2019 11:28 PM

తొగుట : వర్షాలు సకాలంలో కురియడంతో పంట ఏపుగా పెరుడంతో రైతులు సంతోషంగా ఉన్న సమయంలో.. లద్దె పురుగు వ్యాపించడంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. లద్దె పురుగు నివారణకు తెలిసిన రసాయన మందులు పిచికారి చేసినా పురుగుల ఉధృతి తగ్గకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పురుగు పొద్దంతా పత్తి మొదళ్లలో మట్టిలో ఉండి రాత్రి చేల మీద పడి పత్తి పూతను, కాయలను తింటున్నది. రసాయన మందుల పిచికారి సమయంలో పురుగు లేకపోవడంతో దాన్ని నివారించలేకపోతున్నారు. లింగంపేటకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగు చేశారు. లద్దె పురుగు సోకడంతో పురుగు నివారణకు గజ్వేల్‌ పట్టణంలోని జ్యోతి ఫర్టిలైజర్‌ షాప్‌లో మందులు కొనుగోలు చేసి పిచికారి చేయడం జరిగిందన్నారు. వేలకు వేలు పెట్టి రసాయన మందులు పిచికారి చేసినా ఫలితం లేకపోవడంతో షాపు యజమానిని అడుగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారీతిగా రసాయన మందులు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. లద్దె పురుగు నివారణకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
రైతులు ఆందోళన చెందకండి..
పత్తి చేలకు తొగుట మండలంలో లద్దె పురుగు సోకిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి మోహన్‌ తెలిపారు. ఫర్టిలైజర్‌ షాప్‌ల యజమానులు ఇష్టారీతిగా రసాయన మందులను రైతులకు రెఫర్‌ చేయవద్దని ఆయన సూచించారు. రైతులు వ్యవసాయాధికారుల సూచన మేరకు రసాయన మందులు కొనుగోలు చేయాలన్నారు. లద్దె పురుగు నివారణకు లార్విన్‌ (తియోడి కార్బ్‌) రసాయన మందును ఎకరాకు 300 గ్రాములు పిచికారి చేయాలని ఆయన తెలిపారు. లింగంపేటలో లద్దె పురుగు వ్యాప్తి తెలుసుకొని రైతులకు సూచనలు చేశామన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...