పల్లె ప్రగతి కోసమే 30 రోజుల ప్రణాళిక


Sun,September 8, 2019 11:28 PM

రాయపోల్‌ /తొగుట : పల్లెల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్‌ 30 రోజుల ప్రణాళికను రూపొందించారని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి మేరి స్వర్ణకుమారి అన్నారు. ఆదివారం పెద్దఆరెపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికను గ్రామ ప్రజలకు గ్రామ సభ నిర్వహించి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్యం పాటించాలని, వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవతంగా అమలు చేసేందుకు గ్రామ పంచాయతీ పాలక వర్గంతో పాటు గ్రామస్తులు సహకారం అందించాలన్నారు. కార్యక్రమలో గ్రామ సర్పంచ్‌ కరుణాకర్‌,పంచాయతీ కార్యదర్శి రాజేశ్‌, పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌తోనే గ్రామాల అభివృద్ధి
మిరుదొడ్డి : సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాలతోనే గ్రామాలు నేడు అన్ని రగాంల్లో అభివృద్ధిని సాధిస్తున్నాయని మోతె సర్పంచ్‌ కాలేరు శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం మోతెలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శ్రమదానం చేసి చెత్తా, చెదారం, పిచ్చి మొక్కలను తొలిగించి వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రకారం వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని పే ర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
మూడో రోజు కార్యక్రమంలో మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రత్యేకాధికారులు, స ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, వార్డు సభ్యులు, కమిటీ స భ్యులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో పారిశుధ్య నివారణ చర్యలు చేపట్టారు. లింగంపేటలో ప్రత్యేకాధికారి, ఎంఇవో యాదవరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో వాడ వాడలా తిరిగి పాత ఇండ్లను, అపరిశుభ్ర ప్రదేశాలను పరిశీలించారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌ తాం డాలో, కాన్గల్‌లో సర్పంచ్‌లు దామరంచ ప్రతాప్‌రెడ్డి, మాధవరెడ్డి గారి ప్రేమల ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ద్వారా చెత్తా చెదారం తొలిగించారు. వెంకట్‌రావుపేటలో పాత ఇండ్లను పరిశీలించే కార్యక్రమం కొనసాగుతున్నది.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...