విలీన గ్రామాల్లో చెత్త శుద్ధి


Sun,September 8, 2019 03:28 AM

-జిల్లా మినరల్ ఫండ్ నుంచి మున్సిపాలిటీలకు 22ఆటోలు..
-మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలతో మంజూరు చేసిన కలెక్టర్
-ప్రతినిత్యం ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ
-హర్షం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు


సూర్యాపేటప్రతినిధి, నమస్తేతెలంగాణ : పంచాయ తీలుగా ఉన్న సమయంలో అరకొర నిధులు, సిబ్బంది లేమి, ఉన్న సిబ్బందికి అతి తక్కువ వేతనాలు వెరసి చా లా గ్రామాల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి కంపు కొడుతుండేవి. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధు లు ఇవ్వడం తగ్గించడంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం గ్రామ స్వరాజ్యాన్ని అత్యంత ప్రాధాన్యతా అంశం గా పరిగణించడంతో నేడు గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. రోడ్లు వేయడం, మురికి కాల్వల పరిశుభ్రత, హరితహారంలో మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలతోపాటు సంక్షేమ పథకాలతో గ్రామీణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అయినప్పటికీ చెత్తా చెదారం మాత్రం పేరుకుపోతూనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన నూతన పంచాయతీరాజ్ చట్టంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందిని ప్రతి అంశంలోనూ బాధ్యులు చేస్తుండడంతో గ్రామాల్లో అన్ని సమస్యలు తీరిపోనున్నాయి. మున్సిపాలిటీలకు ఆదా యం ఉండడం, ప్రభుత్వం కూడా నిధులు వెచ్చిస్తుండడం, అధికారుల నిరంతర పర్యవేక్షణతో గ్రా మాలతో పోల్చుకుంటే మున్సిపాలిటీల్లో మెరుగ్గా ఉంటుంది.

నిత్యం ఇంటింటికీ చెత్త వాహనం
మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలతో విలీన గ్రామాలకు కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ 22 కొత్త ఆటోలను మంజూరు చేయడంతో ఆయా గ్రామాల్లో శానిటేషన్ మరింత మెరుగైంది. ఇటీవల మంత్రి హామీతో సూర్యాపేటలో విలీనమైన గ్రామాల్లో ఇప్పటికే ఉన్న శానిటేషన్ సిబ్బందికి వేతనాలు భారీగా పెరగగా, మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా ఆర్థిక పరిస్థితులను బట్టి వేతనాలు పెంచే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. దీంతో సిబ్బందిలో కూడా చిత్తశుద్ధి పెరిగింది. ప్రతి నిత్యం మంజూరైన ఆటోలతో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. గతంలో ఆయా గ్రామాల్లో శానిటేషన్ దయనీయంగా ఉండగా, నేడు చాలా చోట్ల చెత్తశుద్ధి పెరిగింది. సూర్యాపేట, తిరుమలగిరి, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు వాహనాలను ఇవ్వగా కోదాడలో మాత్రం మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేశారు.

విలీన గ్రామాలైన కుడకుడ, బీబీగూడెం, దురాజ్‌పల్లి, పిల్లలమర్రి, గాంధీనగర్, రాయినిగూడెం, దాసాయిగూడెం, కేసారం ఆవాసం కుసుమవారిగూడెం, కేటీఅన్నారం ఆవాసం కుప్పిరెడ్డిగూడేలతోపాటు తిరుమలగిరి, మాలిపురం, నందాపురం, అనంతారం, నేరేడుచర్ల రామాపురం, దిర్శించర్ల ఆవాసం నర్సయ్యగూడెం, చిల్లేపల్లి ఆవాసం రామగిరి, నేతాజీగూడేల్లో నిత్యం ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తుండడంతో గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...