అన్ని ఫిర్యాదులకు ఒకే రకంగా స్పందించాలి: ఎస్పీ వెంకటేశ్వర్లు


Sun,September 8, 2019 03:26 AM

సూర్యాపేట సిటీ: ఎలాంటి ఫిర్యాదుకైనా ఒకేలా స్పందించాలని ఎస్పీ రావిరాల వెంకటే శ్వర్లు రిసెప్షన్ సిబ్బందికి సూచించారు. శనివారం ఆయన సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌స్టేషన్‌లో 55 విధానం అమలు, పరిశుభ్రత, రిసెప్షన్ సెంటర్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిసెప్షన్ ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని గమనించి పని చేయాలని సూచించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా చూడాలన్నారు. అన్ని ఫిర్యా దులకు ఒకే రకంగా స్పందించాలని ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐ శివశంకర్, ఎస్‌ఐలు సిబ్బంది ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...