నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ


Sun,September 8, 2019 03:26 AM

సూర్యాపే సిటీ/ మఠంపల్లి /చింతలపాలెం: నిమజ్జనం రోజున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను కలెక్టర్ డి.అమయ్‌కుమార్ ఆదేశించారు. సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు, రత్నపురం గ్రామంలోని మూసీ ప్రాజెక్టు ,మట్టపల్లి కృష్ణానది వం తెన, చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు, బుగ్గమాధారం నిమజ్జన ప్రదేశాలను ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లుతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 22 నిమజ్జన ప్రాంతాలను ఏర్పాటు చేశామన్నారు. మట్టపల్లి కృష్ణానదిపై నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక లైటింగ్, కృష్ణ్ణానదిలో గజ ఈతగాళ్లు, మత్స్యకార్మికులను భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు మట్టపల్లిలో 300 విగ్రహాలు నిమజ్జనమయ్యాయని, మట్టపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి ఇంకా సుమారు 1000 విగ్రహాలు రావచ్చని తెలిపారు. క్లస్టర్స్‌గా విభజించి పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు.

గణేష్ నిమజ్జనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులు, పోలీస్ సిబ్బందికి సూ చించారు. భక్తులు నిమజ్జన సమయాల్లో నీళ్లలోకి దిగవద్దని హెచ్చరించారు. వాహనదారులు పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు నిలపాలని, భక్తులకు, సందర్శకులకు, ప్రజలకు ఎ లాంటి ఇబ్బందులు కలిగించవద్దన్నారు. కా ర్యక్రమాల్లో సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, డీఎస్పీలు నాగేశ్వర్‌రావు, సుదర్శన్‌రెడ్డి, సీఐలు శివరామిరెడ్డి, రాఘవరావు, ఆర్డీఓ మోహన్‌రావు, తహసీల్దార్ కమలాకర్, మూసీ డీఈ నవీకాంత్, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ సురేష్,ఎస్‌ఐ వెంకటరెడ్డి, మహేష్, ఎంపీపీ ముడావత్ పార్వతి పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...