నేటి నుంచి హుజూర్‌నగర్‌లో ముత్యాలమ్మ జాతర


Sun,September 8, 2019 03:26 AM

హుజూర్‌నగర్, నమస్తేతెలంగాణ : శ్రావణమాసంలో జరుపుకునే పండుగల్లో ముత్యాలమ్మ పండుగ ముఖ్యమైనది. హుజూర్‌నగర్ పట్టణంలో ముత్యాలమ్మ పండుగను జరుపుకున్నంత ఘ నంగా తెలంగాణలోని ఇతర ఏ జిల్లాలో కూడా ఇంత ఘనంగా ముత్యాలమ్మ జాతర జరగదంటే అతిశయోక్తికాదు. పండుగ రోజున ప్రభలను కట్టే ఆనవాయితీ నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. పండుగ రోజుల అమ్మవారి గుడి వరకు వేల సంఖ్యలో ప్రభలను కట్టి అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడానికి మహిళలు వేల సంఖ్యలో బోనాలను ఎత్తుకుని వచ్చి అమ్మవారి గుడి చుట్టూ తిరిగి సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని కో రుకుంటారు. గండదీపం నెత్తిన పెట్టుకు ని బోనం ఎత్తుకుని నూతన దంపతులు అమ్మవారికి మొక్కుకుంటే పిల్లలు కలుగుతారని నమ్మకం బలంగా ఉంది. పిల్లలు కలిగిన దంపతులు పండగ సమయంలో మొక్కిన మొక్కులను తీర్చుకుంటారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ము త్యాలమ్మ జాతర ఐదు రోజుల పాటు జరగనుంది.

ముందుగా గ్రామ దేవతలకు మొక్కులు ..
ముత్యాలమ్మ జాతరకు ఏర్పాటు చేయడానికి ముందుగా వివిధ కులాల వారు తమ గ్రామ దేవతలకు ముందుగా మొక్కులను చెల్లిస్తారు. గౌడ కులస్తులు కాటమయ్యకు, యాదవులు గంగమ్మకు, ముదిరాజ్‌లు పాండవులకు మొక్కులు చెల్లిస్తారు. అనంతరం బొడ్రాయికి, కోటమైసమ్మకు, కనకదుర్గమ్మ పాత గుడి వద్ద మేళతాళాలతో, నాట్యాలతో మేకపోతులను బలి ఇచ్చిన తరువాతనే జాతర ప్రారంభం అవుతుంది.

ముసలిముత్యాలమ్మతో జాతర ప్రారంభం
పట్టణంలోని 3వ వార్డులోని ఊరచెర్వు గట్టునున్న ముసలిముత్యాలమ్మ గుడిలో మొదటి రోజు ఆదివారం జాతర ఆరంభమవుతుంది. సోమవారం మూడు ముత్యాలమ్మలుగా పిలవబడే అం కమ్మ, మద్దిరావమ్మ, యలమంచమ్మలకు మొక్కులను చెల్లిస్తారు. ఈ సందర్భంగా భక్తులు బోనాలతో, ప్రభలతో గుడి చుట్టూ ప్రదక్షిణలను చేస్తూ మొక్కులను తీర్చుకుంటారు. మిగిలిన మూడు రోజులు కనకదుర్గమ్మకు పూజలను జరుపుకుంటారు. దీంతో ఐదు రోజుల జాతర ముగుస్తుంది.

పోచమ్మ పేరుతోనే పోచెంచర్లగా పేరు
హుజూర్‌నగర్‌గా పిలవబడుతున్న ఈ పట్టణం అసలు పేరు పోచెంచర్ల. పోచమ్మ దేవత చెరువు దేవత చెరువు కట్టమీద ఉండటం వల్ల ఊరుకు పోచెంచర్ల అను పేరు వచ్చింది. ఆ తరువాత నిజాం పరిపాలనలో హుజూర్‌నగర్‌గా మార్చారని ప్రజలు చెబుతున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...