మంచి నాయకుడిని కోల్పోయాం


Sat,September 7, 2019 11:36 PM

-ముత్యంరెడ్డి చాడ వెంకట్‌రెడ్డి
తొగుట చివరి శ్వాస వరకు రైతు హితమే లక్ష్యంగా పనిచేసిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి అకాల మరణం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తొగుటలో ముత్యంరెడ్డి కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా.. వ్యవసాయం మరువని నాయకుడని, సంక్షేమం కోసం పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డితోపాటు కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ఆయన వెంట సీపీఐ నాయకులు అడ్ల వెంకట్‌రెడ్డి, మంద పవన్ ఉన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...