క్రీడాకారులను ప్రోత్సహించాలి


Sat,September 7, 2019 11:35 PM

కొండపాక : పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంచేలా ప్రోత్సాహం ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. కొండపాకలోని వేద ఇంటర్నేషనల్ పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. సమావే శంలో ముఖ్యఅతిథిగా డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి మాట్లాడు తూ... విద్యా ర్థులు చదువుకుంటూనే క్రీడలపై ఆసక్తిపెంచుకుని శిక్షణ పొంది నైపుణ్యం పొందాలని సూచించారు. ఆటలు చదువులో భాగమేనన్నారు. విద్యార్థుల ఆసక్తిని గ్రహించి ఆటల్లో ప్రోత్సహించాలని టీచర్లకు సూ చించారు. అలాగే, క్రీడాకారు లను నిరంతరం ప్రోత్స హించి, సహకరించాలన్నారు. మండలంలోని పాఠశాలలకు 10 స్పోర్ట్స్ షూ ఇస్తామని తెలిపారు. అలాగే, మండలం నుంచి ఎంపికైన జట్ల కు జిల్లాలో పాల్గొనడానికి స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తామని హామీ ఇచ్చారు.

సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షురాలు చిట్టి మాధురి మాట్లాడుతూ.. గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయిన వారు బాధపడకుండా గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. విజేత క్రీడాకారులకు ప్రకృతి వెంచర్స్ ప్రతినిధి మహిపాల్‌రెడ్డి సహకరంతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, పీడీ భాస్కర్‌రెడ్డి, బందారం ప్రధానోపాధ్యాయుడు విఠల్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయేందర్‌రెడ్డి, ఎస్టీయూ నాయకుడు లింగ శ్రీనివాస్, పీఈటీఏటీఎస్ జిల్లా అధ్యక్షుడు తోట సతీష్, పీఈటీలు బాబు, సుశీల, రజిత, కరుణ పాల్గొన్నారు.

గెలుపొందిన జట్ల వివరాలు..
అండర్- 14 ఖోఖోలో సిరిసినగండ్ల పాఠశాల ప్రథమ, మర్పడగ పాఠశాల ద్వితీయ, బందారం పాఠశాల తృతీయ స్థానం.
అండర్- 17 విభాగంలో సిరిసినగండ్ల పాఠశాల ప్రథమ, మర్పడగ పాఠశాల ద్వితీయ, కుకునూర్‌పల్లి తృతీయ స్థానం.
కబడ్డీ ఆటలో అండర్-14 బాలికల విభాగంలో సిరిసనిగండ్ల పాఠశాల విద్యార్థులు ప్రథమ, కొండపాక జడ్పీహెచ్‌ఎస్ ద్వితీయ, కొండపాక కేజీబీవీ తృతీయ స్థానంలో నిలిచారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...