రైతులందరికీ యూరియా సరఫరా


Fri,September 6, 2019 11:28 PM

-రైతులకు కావాల్సినంత అందుబాటులో ఉంచాలి
-వారిలో విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలి
-జిల్లావ్యాప్తంగా నిల్వలు పెంచండి
-వ్యవసాయ,మార్క్‌ఫెడ్ అధికారులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశం
-అదనంగా 6 వేల మెట్రిక్ టన్నుల యూరియా : డీఏవో

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని సొసైటీల్లో యూరియా అందించాలి.. సొసైటీలు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులు.. యూరియా కొరత లేదని రైతులకు విశ్వాసం కలిగేలా చెప్పాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, డీఏవో శ్రావణ్, మార్క్‌ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులు, కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్లతో యూరియా కొరతపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు యూరియా కొరత లేదని అందుబాటులోనే ఉం దని.. వారికి వివరంగా చెప్పాలని సూచించారు. కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా రైతుల వద్దకే లారీలను పంపాల న్నారు. దీంతో రైతులకు ఖర్చులు తగ్గి యూరియా బస్తాలు గ్రామంలో పంపిణీ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు.

యూరియా కొరత ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారని.. వారికి భరోసా ఇచ్చే లా ప్రజాప్రతినిధులు, అధికారులు, కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్లు పనిచేయాలన్నారు. సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందన్న విషయంపై మార్క్‌ఫెడ్, వ్యవసాయ అధికారులను ఆరా తీయగా జిల్లాలో గత ఏడాది 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వడం జరిగిందని, ఈ సారి 25,800 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గత ఏడాదితో పోల్చితే 6 వేల మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా అందజేశామని వ్యవసా య అధికారి శ్రావణ్ తెలిపారు. జిల్లా ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు 3500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటే మరో 1500 టన్ను ల యూరియా అంటే మూడు రెట్లు అదనంగా తెప్పించినట్లు అధికారు లు ఎమ్మెల్యేకు వివరించారు.

సమీప జిల్లాల్లో యూరియా కొరత ఏర్పడిం దన్నారు. ఈ నేపథ్యంలో యూరియా విక్రయాలు జరుపుతున్న సమయంలో పక్క జిల్లాలోని రైతులు యూరియా కోసం ఇక్కడికి రావడంతో సమస్య వస్తుందని అధికారు లు వివరించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారులతో హరీశ్‌రావు ఫోన్‌లైన్‌లో మాట్లాడి.. పక్కా జిల్లా ల రైతులు సిద్దిపేట్లకు యూరియా కోసం వస్తున్నారని, ఇందుకు జిల్లాకు అదనంగా మూడు రోజుల్లో యూరియా ఇవ్వాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందకుండా కలెక్టరేట్, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో టోల్‌ఫ్రీ నం బర్ ఏర్పాటు చేయాలని డీఆర్‌వో చంద్రశేఖర్, డీఏవో శ్రావణ్‌కు ఎమ్మెల్యే సూచించారు. సమీక్షలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని పీఏసీఎస్ చైర్మన్లు, అధికారులు ఉన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...