తల్లి మందలించిందని..విద్యార్థిని ఆత్మహత్య


Fri,September 6, 2019 11:24 PM

మద్దూరు : తల్లి మందలించిందని కూతురు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అర్జున్‌పట్లలో గురువారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ సాయికుమార్ తెలిపిన వివరాలు.. అర్జున్‌పట్లకు చెందిన ఒగ్గు శ్రీనివాస్, మంజుల దంపతుల కూతురు పూజ(14) చేర్యాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. ఈ క్రమం లో రోజు మాదిరిగా పాఠశాలకు వెళ్లిన పూజ.. స్కూల్ కు సంబంధించిన బస్సులో కాకుండా ఆర్టీసీ బస్సు లో ఇంటికి వచ్చింది. దీనిపై తల్లి మందలించడంతో క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు సేవిం చి పూజ ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యు లు పూజను చికిత్స కోసం 108లో చేర్యాల సర్కారు దవాఖానకు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొం దుతూ పూజ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు ఎస్‌ఐ సాయికుమార్ తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...