బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారిద్దాం


Fri,September 6, 2019 11:24 PM

సిద్దిపేట అర్బన్ : బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారిద్దామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కార్యాలయంలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్స్, ఆరోగ్యకార్యకర్తలకు సదస్సు, శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న వ్యాధి క్యాన్సర్ అని, ప్రాథమిక దశలోనే గుర్తించి కాపాడుకోవాలని, ప్రాణం మీదకొస్తేగానీ పట్టించుకునే పరిస్థితిలో చాలా మంది ఉన్నారని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు. వచ్చే నెల అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ కాన్యర్ మాసంగా పని చేయాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్ అనేది పెద్ద ప్రాణాంతక వ్యాధి అని, దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి జాగ్రత్త పడేలా మహిళలో సం పూర్ణ అవగాహన కల్పించాలన్నారు.

బ్రెస్ట్ క్యా న్సర్‌పై చైతన్యం తె చ్చేలా ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, ఆరో గ్య కార్యకర్తలు కృషి చేయాలన్నారు. దీని నివారణకు సిద్దిపేట నుంచే తొలిఅడుగు పడేలా చూడాలని పిలుపునిచ్చారు. మహిళలందరూ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. మహిళలందరూ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకొని, బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో రాష్ట్రంలోనే సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలు మొదటి స్థానంలో నిలవాలన్నారు. సిద్దిపేటలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ రఘురామ్ ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ నివారణపై మహిళల్లో సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. డాక్టర్ రఘురామ్ అందిస్తున్న శిక్షణను వైద్య సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, డాక్టర్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...