ఆటలతోనే ఆరోగ్యం, దృఢత్వం


Fri,September 6, 2019 11:23 PM

కొండపాక : ఆటలతో ఆరోగ్యం చేకూరడంతో పాటు శారీరక దృఢత్వం, మానసికోల్లాసం కలుగుతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కొండపాక మండంలోని వేద ఇంటర్నేషనల్ మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 65వ మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కొండపాక మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన క్రీడల ప్రారంభ సమావేశంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థులు క్రీడా రంగంలో ఉత్తమమైన ప్రతిభను చాటి క్రీడాకారుడిగా కీర్తి సాధించాలన్నారు. ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు ఆటలకు దూరమై మానసికంగా, శారీరకంగా కృంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలపై చదువు అనే ఒకే విషయంపై ఒత్తిడిని కలిగించకుండా, క్రీడలకు అవకాశం కల్పించాలన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించి, వారు క్రీడల్లో రాణించేలా ప్రోత్సాహాన్నించేందుకే పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులు ఈ వేదికను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. గెలుపు ఓటములకు ప్రాధాన్యమివ్వకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. కొండపాక మండల విద్యార్థులు ఎస్జీఎఫ్ క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ ర్యాగల్ల సుగుణ దుర్గయ్య, వైస్ ఎంపీపీ దేవి రవీందర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు చిట్టి మాధురి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గయ్య, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శివకుమార్, ఎంపీటీసీలు అనసూయ, లక్ష్మి, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...