ఎమ్మెల్యే సహకారంతో గ్రామాభివృద్ధి


Wed,September 4, 2019 10:45 PM

-క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలన
అక్కన్నపేట : ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఈ వానకాలంలో మండలంలోని 14 రెవెన్యూ గ్రామాల్లో 40 పంట కోత ప్రయోగాల్లో భాగంగా వరి, మక్కజొన్న పంటలను బుధవారం క్షేత్ర స్థాయిలో ఏఈవోలు పరిశీలించారు. ఈ సందర్భంగా పంట కోత పరీక్షల ద్వారా వచ్చే దిగుబడిని బట్టి పంటబీమా చేసుకోవచ్చునన్నారు. తద్వారా రైతులకు పంటనష్టం అందజేయవచ్చునని మండల వ్యవసాయాధికారి డాక్టర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు. అలాగే రైతు బీమా పథకంలో భాగంగా రైతుబీమా బాండ్‌లలో తప్పులు ఉన్నా, రైతులు ఇచ్చిన నామినీ చనిపోతే అర్హులైన రైతులను తిరిగి దరఖాస్తులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చునన్నారు. కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది, వయస్సు 18 సంవత్సరాల నుంచి 59 ఏండ్లు కలిగిన రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్, ఆధార్‌కార్డు జిరాక్స్, నామినీ వివరాలను పూర్తి చేసి మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమర్పించాలని ఆయన కోరారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...