ఉచిత వైద్య సేవలు అభినందనీయం : ఎంపీపీ కొక్కుల కీర్తి


Wed,September 4, 2019 10:45 PM

కోహెడ : ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎంపీపీ కొక్కుల కీర్తి అన్నారు. రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో మండల లయన్స్ క్లబ్ ప్రతినిధులు మండలంలోని తంగల్లపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్యశిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు అన్ని రకాల వైద్య సేవలను పొందలేరన్నారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు గ్రామీణ పేదలకు ఉచితంగా నేత్ర వైద్య సేవలు అందించటం అభినందనీయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. శిబిరంలో 85మందికి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కండ్లద్దాలు, మందులను పంపిణీ చేశారు. అలాగే చికిత్సలు అవసరం ఉన్నవారికి రేకుర్తి దవాఖానకి తీసుకెళ్లారు. కార్యక్రమంలో సర్పంచ్ పాము నాగేశ్వరి, ఎంపీటీసీ కోనె శేఖర్, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు కోహెడ ప్రసాద్‌రావు ప్రతినిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరళ, నాయకులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...