పలు గ్రామాల్లో పోచమ్మ బోనాలు మట్టి గణపతులనే పూజిద్దాం


Mon,August 26, 2019 02:47 AM

గజ్వేల్‌ రూరల్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులనే పూజించాలని యువజన సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశబోయిని నర్సింహులు కోరారు. గజ్వేల్‌లో ఆదివారం జరిగిన యువజన సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులతో కలిసి మట్టి గణపతినే ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పర్యావరణం దెబ్బతింటుందని, ఆ విగ్రహాలు భూమిలో కరగడానికి కొన్నేండ్లు పడుతుందని అప్పటివరకు దీంతో నీటి కాలుష్యం పెరిగిపోతుందన్నారు. గ్రామానికి ఒకే మట్టి గణపతిని ప్రతిష్టించడానికి యువకులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువజన సంఘాల సభ్యులు, సంతోష్‌, నరేశ్‌, వినోద్‌, సాదక్‌, ఇంద్రాగౌడ్‌, కుమార్‌, సంతోష్‌, ప్రవీణ్‌, రమేశ్‌, శేఖర్‌, ఏగొండ, రాజు, రవి తదిరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...