విద్యుత్‌ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే


Mon,August 26, 2019 02:45 AM

హుస్నాబాద్‌రూరల్‌: గౌరవెల్లి ప్రాజెక్టులో భాగంగా ముంపునకు గురైన భూనిర్వాసితులు మండలంలోని పోతారం(ఎస్‌) సమీపంలో నిర్మించుకుంటున్న కాలనీలో ఆదివారం ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ విద్యుత్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములను ఇచ్చిన వారి త్యాగాలను కొనియాడారు. భూ నిర్వాసితులకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఇంటి నిర్మాణాలకు త్వరగా అనుమతులు వచ్చేలా చూడాలని పాలకవర్గసభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీలు లకావత్‌ మానస, మాలోతు లక్ష్మీ, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎడబోయిన తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ బత్తిని సాయిలు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎంపీటీసీ ఆలేటి అరవింద, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఆలేటి కొండల్‌రెడ్డి, నాయకులు గడ్డం మోహన్‌, ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి పరామర్శ..
కూచనపల్లి గ్రామానికి చెందిన మడప వజ్రవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో మృతురాలి కుటుంబాన్ని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ పరామర్శించారు. వారి వెంట సర్పంచ్‌ కేసిరెడ్డి రాంచంద్రారెడ్డి ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...