ఉచితంగానే అంతిమ సంస్కారాలు


Mon,August 26, 2019 02:44 AM

గ్రామాల్లో ఎవరు చనిపోయిన వారి అంతిమ సంస్కారాలు ఉచితంగా ఉండే విధంగా చేయాలని గ్రామ పంచాయతీ, దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేసేలా ప్రణాళిక రూపొందించుకొని రాష్ట్రంలోనే సిద్దిపేటను ముందుంచుదామన్నారు. గ్రామాల్లో సామూహిక గొర్రెల షెడ్లు ఏర్పాటు చేసుకున్నామని ఆ దిశగా పశువుల కోసం సామూహిక షెడ్లు, హాస్టళ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్లాస్టిక్‌ రహిత సిద్దిపేటగా చేయడంలో ఇప్పటికే ప్రజల్లో చైతన్యం తెచ్చామని, అదే స్ఫూర్తితో నియోజకవర్గ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ రహిత సిద్దిపేట నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మీవంతు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్‌ మెంబర్‌ తుపాకుల బాల్‌రంగం, ఎంపీపీ జాప అరుణాదేవి, జడ్పీటీసీ తడిసిన ఉమావెంకట్‌రెడ్డి, జడ్పీవైస్‌చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఏఎంసీ చైర్మన్‌ ఎడ్ల సోంరెడ్డి, జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుడు దువ్వల మల్లయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, స్థానిక సర్పంచు డాకూరి కనకవ్వ, ఎంపీటీసీ తిరుపతి, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కోల రమేశ్‌గౌడ్‌, మాజీ ఏఎంసీ చైర్మన్లు వేముల వెంకట్‌రెడ్డి, సంగు పురేందర్‌, మండల పార్టీ అధ్యక్షుడు లింగంగౌడ్‌, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...