ప్రభుత్వ పాఠశాలల్లో యోగా


Mon,August 26, 2019 02:43 AM

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. మానసిక ప్రశాంతత కోసం యోగ, ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఫిట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 10కే రన్‌ విజేతలకు జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణ శర్మతో కలిసి బహుమతులను అందజేశారు. ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు 10కే రన్‌, రన్నింగ్‌ మారథాన్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు.
భవిష్యత్‌ తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా యోగా, ప్రాణయామం చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ఆరోగ్య సిద్దిపేట నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నామని, ఇందుకోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా, ప్రాణాయామంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫిట్‌ ఫౌండేషన్‌ మంచి ఇన్నోవెట్‌ కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. 10కే రన్‌లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు ఉదయం సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన 10కే రన్‌లో పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, ఫిట్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...