నిరుపేద రోగులకు సాంత్వన


Sun,August 25, 2019 01:29 AM

-క్యాన్సర్, పక్షవాతం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు భరోసా
-మొండిరోగాలకు ఉచిత వైద్య సేవలు
-ఆధునిక పరికరాలు, అందుబాటులో సిబ్బంది
-ఇప్పటివరకు 1112 క్యాన్సర్, పక్షవాతం రోగులకు చికిత్స
-ప్రైవేటుకు మించి చక్కటి వైద్యం
-కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నిత్యం రక్తశుద్ధి
-గతేడాది అక్టోబర్‌లో డయాలసిస్ సెంటర్ ప్రారంభం
-ఇప్పటివరకు 50 మందికి సేవలు
ఏదైనా రోగమొచ్చిందంటే జేబులు గుల్ల కావాల్సిందే. అందులో దీర్ఘకాల వ్యాధుల బారిన పడితే సంసారాలు ఆగమయ్యే పరిస్థితి. ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఈ దుస్థితిని పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను పటిష్టం చేయడంతోపాటు వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోని ప్రాంతీయ వైద్యశాల నిరుపేద రోగులకు భరోసా ఇస్తున్నది. గతేడాది అక్టోబర్‌లో దవాఖానలో పాలియేటివ్, డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించారు. వైద్య బృందం తొలుత గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, తూప్రాన్, చేగుంట, రామాయంపేట, శివ్వంపేట, నల్గొండ జిల్లా రాజాపేట తదితర ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు వెళ్లి ఆ కేంద్రాల పరిధిలో క్యాన్సర్,పక్షవాతంతోపాటు దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారి వివరాలు సేకరించారు. ముందుగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్యబృందం వారికి ఇంటివద్దే చికిత్స అందించింది.
ఆ తర్వాత పాలియేటివ్ కేర్ సెంటర్‌కు తరలించి అత్యాధునిక వైద్యమందిస్తున్నారు. ఇప్పటి వరకు 1112 మందికి చికిత్స అందించగా..ఇందులో 458 మంది క్యాన్సర్, 654 మంది పక్షవాతం, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. క్యాన్సర్, పక్షవాతం రోగుల కోసం 8 బెడ్లు ఏర్పాటు చేయగా..14 మంది సిబ్బంది ఉన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 27న ఐదు యూనిట్లతో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించగా..ప్రతిరోజు నాలుగుసార్ల చొప్పున ఇప్పటివరకు 50 మందికి డయాలసిస్ సేవలు అందించారు. గడిచిన 10 నెలల్లో 50 మంది వారంలో మూడురోజులు ఉచితంగా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.

గజ్వేల్ టౌన్: అనారోగ్యంతో బాధపడుతూ వై ద్యం చేయించుకోలేని వారికి నేడు తెలంగాణ ప్ర భుత్వం ఉచిత వైద్య సేవలను అందిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నది. క్యాన్సర్ చికిత్స కో సం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎంతో మంది పేద వారికి ఉపశమనం లభిస్తున్నది. గజ్వేల్ దవాఖానలో ఏర్పాటు చేసిన పాలియేటివ్ కేర్ సెంటర్‌తో క్యాన్సర్, పక్షవాతం, ఇతర దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వారికి వైద్యం అందుతుండడంతో రోగులు ప్రభుత్వ వైద్యంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ దవాఖానలోని పాలియేటివ్ కేర్ సెంటర్ నిర్వాహకులు గతేడాది ఏప్రిల్, మే మాసంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ క్యాన్సర్, పక్షవాతం రోగులకు వైద్యం చికిత్సలు అందించారు. నేటి వరకు 1112 మంది రోగులకు వివిధ రకాల చికిత్సలు అందించగా, ఇందులో 458 మందికి క్యాన్సర్, 654మందికి పక్షవాతం చికిత్సలు అందించారు.

గజ్వేల్ దవాఖానలో 2018 ఏప్రిల్‌లో గ జ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, మెదక్ జిల్లా తూప్రాన్, చేగుంట, రామాయంపేట, శివ్వంపేట, నల్గొండ జిల్లా రాజాపేట తదితర ప్రాంతాల్లోని పీహెచ్‌సీ కేంద్రాలకు వెళ్లి, ఆ కేంద్రాల పరిధిలో క్యాన్సర్, పక్షవాతంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి వివరాలు 146 గ్రామాల్లో సేకరించారు. ముందుగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తించిన పాలియేటివ్ కేర్ సెంటర్ వైద్య బృందం వారికి ఇంటి వద్దనే వైద్య చికిత్సలు ప్రారంభించారు. త ర్వాత 2018 అక్టోబర్‌లో గజ్వేల్ దవాఖానలో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, అత్యధునిక వైద్యా న్ని అందిస్తున్నారు. ప్రతిరోజు దవాఖానలో ఓపీ సేవలను కూడా చూస్తుండడంతో ఇప్పటి వరకు 1112మంది చికిత్సలు చేయించుకోగా, అందు లో 458 మంది క్యాన్సర్, 654 మంది పక్షవాతం ఇతర దీర్ఘకాలిన వ్యాధిగ్రస్తులు వైద్యం చేయించుకున్నారు. దవాఖానలో క్యాన్సర్, పక్షవాతం వ్యా ధిగ్రస్తుల కోసం 8బెడ్స్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రంలో 14మంది సిబ్బంది ఉండగా, అందు లో ఒక వైద్యుడు, ఒక ఫిజియోథెరపిస్టు, ఐదుగురు స్టాఫ్ నర్సులు, నలుగురు ఏఎన్‌ఏంలు, ఒక డ్రైవర్ ఉన్నారు. ప్రతి రోజు దవాఖానలో క్యాన్సర్ రోగులు చికిత్స కోసం రావడంతో మెరుగైన వై ద్యం చేసి మందులు అందజేస్తున్నారు.
ఇంటి వద్ద క్యాన్సర్ చికిత్సలు
గజ్వేల్ దవాఖానలోని పాలియేటివ్ కేర్ సెం టర్ వైద్యులు ప్రత్యేక వాహనంలో గజ్వేల్ పరిధిలోని 146 గ్రామాల్లో ఇంటింటి తిరుగుతూ క్యా న్సర్, పక్షవాతం, ఇతర వ్యాధిగ్రస్తులకు ఇప్పటి వరకు వందలాది మందికి వైద్య చికిత్సలు అం దించి రోగులకు మరింత ఆయుష్షును పెంచుతున్నారు. ఐపీ ఓపీ ద్వారా 265 చూడగా, అందు లో 191 మంది క్యాన్సర్, 74 మంది ఇతర రోగులకు చికిత్సలు అందించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం జరుగుతుంది. అ త్యధికంగా జగదేవ్‌పూ ర్ మండలం తీగుల్ గ్రామంలో 21మందికి ఇంటి వద్దనే వైద్యులు చికిత్సలు అందించగా, అందులో 21 మంది పక్షవాతం, ఇతర రోగులుండగా ముగ్గురు క్యాన్సర్ రోగులున్నట్లు వైద్యులు తెలిపారు.

పాలియేటివ్ కేర్ సెంటర్ ఉద్దేశం
క్యాన్సర్ వ్యాధిపై రోగులకు ఉన్న అనవసర భయాన్ని పోగొట్టడం.. రోగులకు అవసరమైన సహకారం అందించడం.. రోగికి ఇంటి వద్దనే వైద్య సేవలు చేయడం.. వ్యాధిగ్రస్తులకు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు సేవలు చేసేలా శిక్షణ ఇవ్వడం.. అలాగే, శారీరక, మానసిక బాధల నుంచి ఉపశమనం కలిగేలా కౌన్సెలింగ్ ఇవ్వడం.. జీవన ప్రమాణాలు తెలియజేసి, ఇతరులతో సంబంధాలు కొనసాగేలా ప్రోత్సహించడం వంటి అంశాలను కౌన్సెలింగ్ ద్వారా తెలియజేస్తారు. ఇప్పటి వరకు ఈ కేంద్రం ద్వారా చాలా మంది వ్యాధిగ్రస్తులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లా దవాఖానలోని పాలియేటివ్ కేర్ సెంటర్ ద్వారా అందుతున్న వైద్య సేవలను డీఎంఅండ్‌హెచ్‌వో అమర్‌సింగ్, పీవోఎన్‌సీడీ పవన్‌కుమార్, సూపరింటెండెంట్ కృష్ణారావు పర్యవేక్షిస్తుండగా డాక్టర్ విజయేందర్‌రెడ్డి వైద్య చికిత్సలు అందిస్తుండగా ఫిజియోథెరపిస్టు గీతా పక్షవాతం రోగులకు సైక్లింగ్, నడిపించడం వంటివి చేపడుతూ వారిని ఆరోగ్యంగా చేయడంలో ఎంతో శ్రమిస్తున్నారు. ఇంటి వద్ద క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారు గజ్వేల్ దవాఖానలోని పాలియేటివ్ కేర్ సెంటర్ నెంబర్ 9701298209 కు సంప్రదించాలని కోరారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...