ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలి


Sun,August 25, 2019 01:17 AM

కొండపాక: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రం కొండపాకలో సర్పంచ్ చిట్టి మాధురి-దేవేందర్‌రెడ్డి, కోనాయిపల్లిలో సర్పంచ్ వసంత, మంగోల్‌లో సర్పంచ్ కిరణ్‌కుమార్, జప్తినాచారంలో సర్పంచ్ కనకయ్య, మర్పడగలో సర్పంచ్ ఏమల్ల రజిత-రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాలలో జలశక్తి అభియాన్‌పై అవగాహన సదస్సును నిర్వహించారు. రైతులు వ్యవసాయ భూముల్లో భూఉపరితల చెరువులు నిర్మించుకోవాలని, ఇంకుడుగుంతలు ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...