కనుల పండువగా కృష్ణాష్టమి


Sun,August 25, 2019 01:16 AM

సిద్దిపేట టౌన్ : శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం అంబరాన్నంటింది. సిద్దిపేటలోని కమా న్ వద్ద గల కృష్ణాలయంలో స్వామి వారి శోభాయాత్ర రమణీయంగా జరిగింగి. తడ్కపల్లి ఆవా స విద్యార్థుల కోలాటం, చిన్నారుల ఉట్టి కొట్టుట అందరినీ ఆకట్టుకుంది. రాధా కృష్ణుల గోపికల వేషధారణతో చిన్నారులు అలరించారు. శుభోదయం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నారులు పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అంబేద్కర్‌నగర్‌లో కృష్ణాష్టమి వేడుకలు గ్యాదరి రాజారాం ఆధ్వర్యంలో జరిగాయి. వాస వీ వనితా క్లబ్ మహిళా ప్రతినిధులు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించి స్వామి వారి పవళింపు సేవలో పాల్గొన్నారు. అభయజ్యోతి మానసిక వికలాంగుల కేంద్రంలో కృష్ణాష్టమి ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో మిమిక్రీ కళాకారుడు రమే శ్ విద్యార్థులను అలరించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...