లక్ష్యం.. దసరా


Sun,August 25, 2019 01:15 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : దసరా లక్ష్యంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం సాగుతున్నది. పినాకిని క్లబ్ వద్ద భవన నిర్మాణానికి శంకుస్థాపన జరుగగా, ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యవేక్షణలో పనుల్లో పెరిగింది. సీఎం కేసీఆర్ రూపొందించిన ప్లాన్‌కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి.
టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాలు ప్రతి జిల్లాలో నిర్మించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకనుగుణంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల శివారులోని పినాకిని క్లబ్ వద్ద సర్వే నంబరు 211లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎకరం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. రూ.60 లక్షలతో నిర్మించే పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి జూన్ 24న భూమిపూజ నిర్వహించారు. అనంతరం రెండు నెలల కాలంలోనే భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోనే వేగంగా సిద్దిపేట పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే మీటింగ్ హాల్‌తో పాటు ప్రహరీ నిర్మాణ పనులతో పాటు మరో హాల్ పనులు జరుగుతున్నాయి.
గ్రౌండ్ ఫ్లోర్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దసరా నాటికి కార్యాలయాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడకుండా పనులు వేగంగా జరిగేలా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలనే వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పనులను పరిశీలించారు. మీటింగ్ హాల్ నిర్మాణంతో పాటు హాల్, రెండు రూములు గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిర్మిస్తున్నారు. జిల్లా పార్టీ సమావేశాలు జరుపుకునేందుకు వీలుగా కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...