దుబ్బాక-కొత్తపల్లి రోడ్డుకు మహర్దశ


Sun,August 25, 2019 01:14 AM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: దశాబ్ధాల కాలంగా సమస్యాత్మకంగా ఉన్న దుబ్బాక-కొత్తపల్లి రోడ్డుకు ఎట్టకేలకు నిధులు మంజూరైనాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన సీఆర్‌ఎఫ్ (సెంట్రల్ రోడ్ ఫండ్) ద్వారా చీకోడ్-శిలాజీగనర్ రోడ్డుకు రూ.7 కోట్లు మంజూరైన విషయం తెల్సిందే. ఈ రోడ్డు విస్తరణ పనులను ఆదివారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు శిలాఫలకం, తదితర ఏర్పాటు పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధ్దం చేశారు.
ఇప్పటివరకు ఉన్న సింగిల్ రోడ్డు ఇకముందు డబుల్ రోడ్డుగా విస్తరించటంతో సంబంధిత గ్రామాలతో పాటు ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డబుల్‌రోడ్డు నిర్మాణంతో దుబ్బాక-కొత్తపల్లి రోడ్డు పరిసర గ్రామాల ప్రజలతో పాటు పక్క జిల్లాలైన కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలకు మేలు చేకూరనున్నది. సీఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.7 కోట్లతో చీకోడ్ నుంచి 7 కి.మీ. దూరం శిలాజీనగర్ (సిద్దిపేట జిల్లా ముగింపు) వరకు 7.5 మీటర్ల వెడల్పుతో డబుల్ రోడ్డు నిర్మించనున్నారు.

దుబ్బాక మండలంలోని చీకోడ్ నుంచి కొత్తపల్లి (సిరిసిల్ల జిల్లా) వరకు రోడ్డు విస్తరణ చేపడుతుండటంతో మన జిల్లాతో పాటు పక్క జిల్లాలైన రాజన్నసిరిసిల్ల , కామారెడ్డి జిల్లా ప్రజలకు మరింతగా ప్రయోజనం చేకూరనున్నది. నిత్యం ఈ రోడ్డు గుండా దుబ్బాక, కామారెడ్డి, గజ్వేల్, సికింద్రాబాద్ ఆర్టీసీ డిపోలకు చెందిన బస్‌లతో పాటు ప్రైవేటు వాహనాలలో వేలాది మంది ప్రయాణీకులు ప్రయాణిస్తుంటారు. ఇన్నాళ్లూ ఈ రోడ్డు (సింగిల్ రోడ్డుగా) 3.5 మీ వెడల్పు ఉండటంతో వాహనచోదకులు, ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ముందు ఈ రోడ్డు డబుల్ రోడ్డుగా(7.5 మీ. వెడుల్పుతో) విస్తరించటంతో సర్వత్రా హర్షం నెలకొంది. డబుల్ రోడ్డు నిర్మాణంతో... చీకోడ్, ఆరెపల్లి, పోతారం, గంభీర్‌పూర్, శిలాజీనగర్, వెంకటగిరితండాలతో పాటు సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి.


ఘనంగా పూజలు దుబ్బాక, నమస్తే తెలంగాణ: దుబ్బాక మండలం చౌదర్‌పల్లి దుబ్బరాజేశ్వరాలయంలో భారీ సంఖ్యలో భక్తుల రాక కొనసాగింది. శ్రావణమాసంలోని చివరి శనివారం సందర్భంగా దుబ్బరాజేశ్వరుడిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి అభిషేకంతో పాటు పలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం వేకువజాము నుంచే ఆలయానికి భక్తుల రాకతో సందడి నెలకొంది. ఆలయం వద్ద మరో రెండు రోజుల పాటు జాతర కొనసాగనుంది. సోమవారం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అర్చకులు దుబ్బరాజం, భానుశర్మ తెలిపారు. భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తు న జాతర కొనసాగింది. మిఠాయి దుకాణాలు, ఆట వస్తువులు, తదితర దుకాణాలతో జాతరలో సందడి నెలకొంది.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...