సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి


Sun,August 25, 2019 01:14 AM

సిద్దిపేట టౌన్ : సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని.. అనుక్షణం కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్నారని టీఆర్‌ఎస్ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రూప్‌సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ మొదటి సిద్దిపేట జిల్లా మహాసభను ఆదివారం కొండా భూదేవి గార్డెన్‌లో నిర్వహిస్తున్నారు. శనివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూప్‌సింగ్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని రంగాల కార్మికులకు మంచి గుర్తింపు తెచ్చిందన్నారు. ప్రతి బీడీ కార్మికుడికి రూ.2016 జీవన భృతిని కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ది అన్నారు.
మొదటి మహాసభకు ముఖ్య అతిథులుగా మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ వస్తున్నారన్నారు. మొదటి మహాసభలకు అన్ని రంగాల కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మంచె నర్సింలు, బీడీ సంఘం నాయకులు శోభన్, పిండి అరవింద్, మధు, నర్సింలు, ఆయిల్‌రెడ్డి, జంగం నాగరాజు, ఎక్భాల్ పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...